Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంబాల్టిమోర్‌కు నేషనల్‌ గార్డు దళాలు

బాల్టిమోర్‌కు నేషనల్‌ గార్డు దళాలు

- Advertisement -

– అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు
– ట్రంప్‌ చర్యలపై డెమోక్రాట్ల ఆగ్రహం

వాషింగ్టన్‌ : డెమోక్రాట్ల ఆధీనంలో ఉన్న నగరాలే టార్గెట్‌గా అక్రమవలసలు, నేరాల అదుపు పేరుతో నేరాల గార్డు దళాల మోహరింపు చర్యలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు దళాలను మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌ సిటీకి కూడా విస్తరిస్తానని హెచ్చరికలు పంపాడు. వాస్తవానికి బాల్టిమోర్‌ వాస్తవానికి డెమోక్రాట్లకు కంచుకోట. అయితే ఇక్కడ నేరాలు అదుపుతప్పాయని ఓ రిపబ్లికన్‌ నాయకుడు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశాడు. అలాగే మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూరేతో పాటు పలువురు డెమోక్రాటిక్‌ లీడర్లు డోనాల్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వివాదాస్పద విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌, వెస్‌ మూరే మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా దళాలను బాల్టిమోర్‌లోనూ మోహరింపచేస్తానని ట్రంప్‌ బెదిరింపులకు దిగటం గమనార్హం.

ఈ నెల ప్రారంభంలో కూడా వాషింగ్టన్‌ వీధులను జాతీయ భద్రతా దళాలు మోహరించాయి. దీంతో ఆ సమయంలో ట్రంప్‌ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు బాల్టిమోర్‌లోనూ జాతీయ భద్రతా దళాలను ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం. నేషనల్‌ గార్డ్‌ ఆదివారం నుంచి వాషింగ్టన్‌లో ఆయుధాలను తీసుకెళ్లడం ప్రారంభించిందని సైన్యం తెలిపింది. అక్రమవలసలపై తాను తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలను అణచివేయడానికి లాస్‌ఏంజిల్స్‌కు దాదాపు 5వేల మంది సైనికులను తరలించాలంటూ ట్రంప్‌ ఈ ఏడాది జూన్‌లో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యను కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. గవిన్‌ న్యూసమ్‌ 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన చికాగోకు వేల మంది నేషనల్‌ గార్డ్‌ దళాలలను మోహరిం చాలని ట్రంప్‌ యంత్రాంగం యోచిస్తున్నదని అమెరికా మీడియా నివేదిస్తున్నది. డెమోక్రాటిక్‌ నేతృత్వంలోని ప్రధాన నగరాలైన చికాగో, న్యూయార్క్‌లలో వాషింగ్టన్‌ మాదిరిగానే నేషనల్‌ గార్డ్‌ మోహరింపులు ఉంటాయని ట్రంప్‌ గత శుక్రవారమే తెలిపారు. దీంతో ఈ విషయంలో అక్కడి డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad