నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ యందు జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతి ప్రకాష్ , పాఠశాల ప్రిన్సిపల్ లత లు మాట్లాడుతూ.. భారత దేశ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడానికి గుర్తుగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.శ్రీ శ్రీనివాస రామానుజన్ జీవితం మనకు కష్టపడి చదవడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో నేర్పుతుందని గణితం భయపడే విషయం కాదు అది ఆలోచనలకు బలాన్ని ఇచ్చే విషయం అని విద్యార్థులందరికీ చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో గణిత సంబంధిత కార్యక్రమాలను క్విజ్ పోటీలు, పజిల్స్, గణిత ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ లో జాతీయ గణిత దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



