Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం

ప్రభుత్వ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితం యొక్క ప్రాముఖ్యతపై వివరించడం జరిగిందన్నారు. గణితం అంటే తార్కిక ఆలోచన, వేగం, ఖర్చుతత్వం, గణితం యొక్క ఫలితము ఏ విధంగా ఎన్ని రకాలుగా చేసినా ఫలితం అనేది మారదని తెలియజేయడం జరిగిందన్నారు. గణితంలో విద్యార్థుల సృజనాత్మకతను బయటికి తీయడం కోసం శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి   సందర్భంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం వాళ్ళ రంగవల్లిక రూపంలో వివిధ రకాలైన ఆకారాలు,సింబల్స్ ను విద్యార్థులు చాలా చక్కగా వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -