Tuesday, December 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మాల్యాల్ లో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే విజయవంతం

మాల్యాల్ లో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ- జన్నారం
గ్రామ ప్రజల యొక్క మానసిక ఆరోగ్య స్థితి, జీవనశైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడం కోసం, చికిత్స అంతరాలను గుర్తించడానికి, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్ మరియు నిమ్హాన్స్ బెంగళూరు ఆధ్వర్యంలో, (నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2) ప్రాజెక్టులో భాగంగా, మండలం, రోటిగుడ పల్లె దవాఖాన కింద మాల్యాల్ గ్రామంలో, మంగళవారం  ఆరోగ్య సర్వే నిర్వహించడం జరిగిందని మండల ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ తెలిపారు. ఈ  కార్యక్రమానికి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కుల్కర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఫ్యామిలీ మెడిసిన్,  డాక్టర్ సాయిక్రిష్ణ తిక్కా, మానసిక వైద్య విభాగం మార్గదర్శకత్వం వహించగా, నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2 తెలంగాణ స్టేట్ కో ఆర్డినటర్ ఆర్. వినీల్ మరియు మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో సర్వే కొనసాగిందన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య సర్వేలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్, వృద్ధాప్య సమస్యలు, మద్యపానం, మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణ, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తూ మానసిక ఆరోగ్యానికి అవగాహన కోసం బ్రోచర్లు మరియు అవసరమైన చోట ప్రాథమిక వైద్య సలహాలను అందించామన్నారు. ఇట్టి కార్యక్రమం స్థానిక గ్రామ ఎమ్ ఎల్ హెచ్ పి నవనీల ఏ.ఎన్.ఎం పద్మ & ఆశా వర్కర్స్ తిరుమల మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ సహకారంతో సోమవారం రోజున సర్వే విజయవంతంగా జరిగిందని తెలియజేశారు.

అదేవిధంగా మాల్యాల్ గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించారని, ఈ ఆరోగ్య సర్వే ద్వారా అధికారులు సేకరించిన సమాచారం జాతీయ మానసిక ఆరోగ్య విధాన రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మానసిక సమస్యలకు 14416 టెలిమనస్ నెంబర్ గురించి వివరించారు. ఈ సర్వేలో బాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం వివరాలను సేకరించిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య బృందం వినిత,గ్రేస్,వేణు మాధురి, రంజిత్ యాదవ్, తిరుపతి, మణికంట, శ్రీధర్, వెంకట రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -