కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి..
కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి..
సీఐటియు జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): జాతీయ,రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాల పిలుపుమేరకు కాటారం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు మాట్లాడారు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. సమ్మే రోజున గ్రామీణ బందుకు ఎస్ కె ఎం పిలుపునిచ్చిందన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం మే 20న జరిగే సమ్మెకు సమయత్వం కావాలని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులందరూ ఈ సమ్మెకు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను,కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తున్నదన్నారు.కార్మిక వర్గం సమరశీల పోరాటల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను ముందుకు తెచ్చిందని, వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడుల అమలు ఐదు సంవత్సరాల ఆలస్యమైనా ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నదన్నారు.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లిందని తెలిపారు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడులను అమలులోకి తెస్తు 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని,సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తున్నది. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను కఠిన తరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా బరితెగించిందన్నారు. ఉమ్మడి బేర సారాల హక్కులను తొలగించి వాటిని బి.ఎన్.ఎస్ చట్టం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా మార్చడం, పని స్థలాల వద్ద గేటు మీటింగ్లు కరపత్రాల పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ తుంగలోకి తొక్కుతున్నారని ఆరోపించారు.చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటీట్ విభాగంగా మార్చడం స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేసే విధంగా లేబర్ కోడులు రూపొందించారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల సమ్మె హక్కు నిర్వీర్యం చేస్తూ సమ్మె చేయలేని పరిస్థితులను ఈ కోడుల ద్వారా కల్పించి కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అందుకే నాలుగు లేబర్ కోడులని తిప్పికొట్టి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కార్మిక వర్గానికి చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్, సిఐటియు జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్ ,ఆదివాసి గిరిజన సంఘం నాయకులు సురేందర్లతోపాటు కార్మికులు పాల్గొన్నారు.
20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES