Thursday, May 8, 2025
Homeఆదిలాబాద్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ను ఆవిష్కరణ

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ను ఆవిష్కరణ

- Advertisement -

 నవతెలంగాణ జన్నారం.

    దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, సిఐటియు జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు.

 సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడులను రద్దు చేయాలని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని,  50 స o”లు పైబడిన హమాలీ కార్మికులందరికీ కనీస పెన్షన్ నెలకు 9 వేలు ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి,పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని,ఇండ్లు లేని పేద హమాలీలు అందరికీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి,, కేంద్రం రూ. 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సహాయం అందించి అమాలి కాలనీలు నిర్మించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, గోదాముల వద్ద మంచినీరు, విశ్రాంతి గదులు,సైకిల్ షెడ్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని, 2025 మే 20న దేశ వ్యాప్తంగా జరిగే ⁹ సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని
 అంబటి లక్ష్మణ్ మండల సీఐటీయూ కన్వీనర్, సీనియర్ నాయకులు కూకట్ కారు బుచ్చయ్య కోరినారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -