Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం 

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం 

- Advertisement -

4 లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా భువనగిరిలో కార్మికుల భారీ ర్యాలీ
నవతెలంగాణ  -భువనగిరి
: ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భువనగిరి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నుండి రైతు బజార్  వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు టిఆర్ఎస్ కే వి జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి అధ్యక్షతన  సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు  రాచకొండ జనార్ధన్ హెచ్.ఎం.ఎస్ జిల్లా నాయకులు తీగల మధు లు మాట్లాడుతూ కేంద్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4కోడ్ లుగా చేయడం వల్ల అన్ని రంగాల కార్మికులకు ఉద్యోగ భద్రత పని భారం పెరిగి యాజమాన్యాలకు కార్మిక వర్గం బానిసలుగా పని చేస్తున్నారన్నారు.

వేట్టి చాకిరి గురవుతున్నారని దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు కార్మికులకు ఇచ్చిన హామీలు మర్చిపోయ్యరన్నారు. ప్రజల పైన కార్మిక వర్గం పైన నిత్యం ధరలు పెంచుతూ భారాలు మోపుతున్నదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం  సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నిర్ణయించిన అమలు కావడం లేదని వారు ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలన్నారు. ప్రతి కార్మికునికి ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ పిఎఫ్  సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

తీర్పు ఇచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా యాజమాన్యాలకు కార్పొరేట్ శక్తులకు వారి ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తూ కార్మికులతో వెట్టిచాకిరికి చేయించు కుంటున్నారన్నారు. వీటితోపాటు ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న స్కీం వర్కర్లైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం లాంటి వర్కర్లను పర్మినెంట్ చేయకుండా పని చేయించుకుంటున్నదన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న హమాలి, బిడి, ఆటో కార్మికులకు సమగ్రమైన  సంక్షేమ బోర్డు తీసుకురావాలన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నదని మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్మిక వర్గం అంతా ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు రామకుమారి ఏఐటీయూసీ నాయకులు సామల శోభన్ బాబు, గనబోయిన వెంకటేష్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, ప్రజా ఫ్రంట్  జిల్లా నాయకులు కాశపాక మహేష్, పెన్షనర్స్ రాష్ట్ర నాయకులు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పల్లెర్ల అంజయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు కృష్ణ, రజక సంఘం జిల్లా నాయకులు వెంకటేష్, ఏఐకేఎంఎస్ నాయకులు అడువయ్య, సహాదేవ్, ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు  ఉప్పల కొమరయ్య, బ్యాంకు యూనియన్ నాయకులు రంజిత్, రమేష్, సామి సత్తయ్య,లక్ష్మయ్య, శ్రీనివాస్,  బసవయ్య,రామ్ చందర్,  వెంకటేష్ , ఐలయ్య, ఎల్లేష్, బుజ్జమ్మ, అనిత, లక్ష్మి, రుక్మిణి, సంతోష, ధనలక్ష్మి, శాంతమ్మ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -