Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే దేశవ్యాప్త సమ్మె

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే దేశవ్యాప్త సమ్మె

- Advertisement -

– మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలి
నవతెలంగాణ – చండూర్
 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు సీపీఐయూ చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలు వేగంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రధానంగా కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పాత చట్టాలను పునరుద్ధరణ చేయాలని, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆయన అన్నారు.

అసంఘటిరంగ కార్మికులకు కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతాంగం కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్ లు అమలు జరిగితే కార్మికులకు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాల కోసం బెర సారాల హక్కు కోల్పోతారని, పనిగంటలు విపరీతంగా పెరుగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మొగుదాల వెంకటేశం,మున్సిపల్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు,నల్లగంటి లింగస్వామి, బీ పంగి నాగరాజు, ఇర్గి యాదయ్య, కలమ్మ, రేణుక, ముత్తమ్మ, అలివేలు,తెలంగాణ గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నాంపల్లి శంకర్, రేవల్లి సైదులు, యూనియన్ నాయకులు నాగిళ్ళ లక్ష్మణ్, అన్నేపాక నరసింహ, మల్లయ్య, పుష్పలత, వెంకటాచారి, నగేష్, వెంకులు, బేరబిక్షమయ్య, లక్ష్మయ్య, మహేందర్, హమాలి యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, యాదయ్య, వెంకన్న, పాశం శేఖర్, బొమ్మర గొని శ్రీను, కట్ట గణేష్, కావలి వెంకన్న, నాగేష్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కట్ట పద్మ, యూనియన్ నాయకులు నాగమణి, పరమేశ్వరి, వరలక్ష్మి, జయమ్మ, పి. నాగమణి, రాధా,వేదవతి, సుమలత, కారింగు జ్యోతి, రోజా,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -