Tuesday, March 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకెన్యాలో ప్రకృతి విలయం ..80 మందికిపైగా మృతి

కెన్యాలో ప్రకృతి విలయం ..80 మందికిపైగా మృతి

- Advertisement -

నైరోబి : కెన్యాలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు వరదల వల్ల 81 మంది మృతి చెందారని కెన్యా నేషనల్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఎన్‌పిఎస్‌) ఆదివారం వెల్లడించింది. ఈ వర్షాలకు అత్యధికంగా దేశ రాజధాని నైరోబి తీవ్ర ప్రభావితమైంది. నైరోబిలో అత్యధిక ప్రాణ నష్టం జరిగింది. ఈ వర్షాలకు నైరోబిలో 37 మంది చనిపోయారు. ఇక తూర్పు ప్రాంతంలో 21, తీర ప్రాంతంలో 5, న్యాంజా ప్రాంతంలో 7, రిఫ్ట్‌ వ్యాలీలో 8, కెన్యాలోని మధ్య ప్రాంతంలో 3 మరణాలు సంభవించాయని ఎన్‌పిఎస్‌ ప్రకటన పేర్కొంది. కాగా, వరదల వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లు, మార్కెట్లు, రహదారులు, నీరు, విద్యుత్‌ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. 2,690 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 48 గంటల్లో కూడా నైరోబి, కెన్యా మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కెన్యా వాతావరణ శాఖ (కెఎండి) హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -