- Advertisement -
చెట్టుని కొట్టిన గొడ్డలి
‘చెక్క’తో చేసిన పెట్టెలో
విశ్రాంతి తీసుకుంటోంది.
కోసిన రంపం విరిగిపోయింది
మోడు చిగురించడం చూసి
తనను కూలుస్తున్న
కూలివాళ్ళకి
చెట్టు పుష్పాభిషేకం!
చెట్టు కూలితే
ఎన్నో జాతులకి నష్టం
కనీసం నీడలేక ఎంత కష్టం
ప్రకృతి పల్లవిస్తూ
రాసే పచ్చని కవిత
చెట్టు విత్తనం ఎవడో వేసాడు
వీడేమో పేరు చెక్కుతూ
చెట్టుకి కడుపు మంట!
విత్తు, మొక్క, చెట్టు
మార్పులో విశేషాలు
వృక్షం ఒక బోధకుడు
సముద్రంలో
మంచి ముత్యాలు
చెట్టుపై మంచు ముత్యాలు
చీడ పట్టిన చెట్టు
నీడనిస్తుంది
మరి చెడు మరిగిన మనిషి?
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008577834
- Advertisement -


