- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
మహాత్మా గాంధీ యూనివర్సిటీ బుధవారం విడుదల చేసిన రివాల్యుయేషన్ ఫలితాలలో నవభారత్ కళాశాల అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. బి బి ఏ లో 10/10 ఎస్ జి పి ఏ సాధించిన విద్యార్థిని సాదం వసుంధర ను, రెగ్యులర్ ఫలితాలలో ఏ జెడ్ సి (సేమ్ టు) 10/10 ఎస్ జి పి ఏ సాధించిన అయిషా బింతే ముబారక్ ను భువనగిరి ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ , కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.ప్రభాకర్ గౌడ్ శలువా, మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు.
- Advertisement -