సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – భూపాలపల్లి
బడుగు, బలహీన వర్గాలకు నవతెలంగాణ సమగ్ర దినపత్రిక అండగా నిలుస్తుందని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందుసాయిలు అన్నారు. కార్మిక కర్షక పక్షపాతిగా వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటు పడుతుందని అభివర్ణించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనం లో’నవతెలంగాణ-2026 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న ఏకైక పత్రిక ‘నవతెలంగాణ’ అని తెలిపారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా సమస్యల పట్ల అవగాహనతో అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న ఈ పత్రిక అని కొనియాడారు.
ప్రతి నిత్యం ప్రజల సమస్యలు వెలికితీసే దినపత్రిక అని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో ఈ పత్రిక ముందుంటుందని కొనియాడారు. కష్టజీవులకు బాసటగా నిలిచి కార్మిక, కర్షక శ్రామిక, రైతుల, పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెలికితీస్తూ ప్రజలకు నిజాన్ని తెలియజేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజలను ఐక్యమత్యం చేస్తూ పోరాటాలకు సిద్ధం చేయడంలో నవతెలంగాణ కృషి చాలా గొప్పది అన్నారు.
అనుదినం.. జనస్వరం గా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రభుత్వానికి చేరవేసే విష యంలో నవతెలంగాణ పత్రిక ముందు వరుసలో ఉందన్నారు. ప్రజల మన్ననలు పొందుతూ మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషిస్తున్న నవతెలంగాణ పత్రికను ప్రజలు ఆదరించాలని కోరారు. అన్నారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, విలేకరులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్,టౌన్ రిపోర్టర్ పుల్ల సృజన్, సిఐటియు జిల్లా నాయకులు గుర్రం దేవేందర్, సీపీఐ (ఎం) పట్టణ కమిటీ నాయకులు ఎండి రజాక్, గట్టు శంకర్, జంగ రాములు, ఓనపాకల లింగయ్య, దుగ్యాల పద్మ, ఓదెలు, మునుకుంట రాజేందర్ తదితరులు ఉన్నారు.



