క్యాలెండర్ల ఆవిష్కరణలో జుక్కల్ ఎమ్మెల్యే తోట
నవతెలంగాణ – మద్నూర్
నవతెలంగాణ దినపత్రిక ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఎల్లవేళలా నిలబడుతూ సమస్యలు ఎప్పటికప్పుడు వెలికి తీయడం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో నవతెలంగాణ దిట్ట అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. 2026 నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవతెలంగాణ దినపత్రిక ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ముందుంటుందని పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మండలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గోపి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



