- Advertisement -
నవతెలంగాణ జన్నారం
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తూ వాస్తవాలను బయటికి తీసే పత్రికగా నవతెలంగాణ, మంచి గుర్తింపు పొందిందని జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామ్మోహన్ అన్నారు. పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శు భాకాంక్షలు తెలియజేశారు. పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని ఆకాంక్షించారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని పేర్కొన్నారు.
- Advertisement -