- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. మండలంలో శాంతిభద్రతలను భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసేవారికి, మట్కా, గుట్కా, గంజాయి, బెల్ట్ షాపులు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్న వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. దీని విషయంలో ఎంతటి వారైనా చట్ట పరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇటీవలే విఆర్ లో ఉన్న తనను జుక్కల్ ఎస్సైగా ఉన్నతాధికారులు నియమించారని తెలిపారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై భువనేశ్వర్ ను దేనిపల్లికి బదిలీ చేశారని స్పష్టం చేశారు.
- Advertisement -