హవీష్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయిక. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను మేకర్స్ ఘనంగా రిలీజ్ చేశారు.
ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ, ‘మా నాన్న ‘జీనియస్, రాక్షసుడు’ వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. నా మొదటి చిత్రాన్ని త్రినాథరావు లాంటి పెద్ద దర్శకుడితో ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.
”నువ్విలా, జీనియస్, సెవెన్’ మూవీస్‌తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదొక బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. త్రినాథరావు అన్ని మూవీస్‌లో ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరింది’ అని హీరో హవీష్ చెప్పారు.
డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ, ‘అప్పట్లో ‘పెళ్లిసందడి’ మూవీలో ఇండిస్టీలోని కమెడియన్స్ అంతా నటించారని విన్నాం. ఈ మూవీలో కూడా ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబంలో ఉండే సరదాలు, ఎమోషన్స్ ..ఇవే మూవీలో ఆకట్టుకుంటాయి. మిక్కీ చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. 50% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి చూసేలా హాయిగా ఉంటుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తూనే ఉంటూ చివరిలో భావోద్వేగానికి గురి చేస్తుంది. నిఖిల ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంటారు. హవీష్ కెరీర్‌లోనూ బెస్ట్ సినిమా అవుతుంది’ అని తెలిపారు.
నయా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -