Thursday, February 12, 2026
E-PAPER
Homeజాతీయంఎన్డీటీవీలో ఉద్యోగులపై వేటు

ఎన్డీటీవీలో ఉద్యోగులపై వేటు

- Advertisement -

– అదానీ యాజమాన్యంలో మరో రౌండ్‌ తొలగింపులు
– వందమందికి నోటీసులు
ముంబయి :
ఎన్డీటీవీలో ఉద్యోగులపై వేటు కత్తి వేలాడుతోంది. అదానీ యాజ మాన్యంలోని ఎన్డీటీవీ మరో రౌండ్‌ తొల గింపులకు సిద్ధమవుతోంది. అన్ని విభాగా లలోని ఉద్యోగుల పనితీరు మెరుగుదల పేరిట తొలగించే చర్యలకు ఉపక్రమించింది. ఈసారి దాదాపు 100 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని పలువురు సిబ్బంది అంచనా వేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో రిపోర్టర్లు, యాంకర్లు, కెమెరా సిబ్బంది, హిందీ , ఇంగ్లీష్‌ ఛానెల్‌ల నుంచి డెస్క్‌ సిబ్బంది సహా పలువురు ఉన్నారు.

డిసెంబర్‌ 2022లో అదానీ గ్రూప్‌ ఎన్డీటీవీ నియంత్రణను సొంతం చేసుకున్న తర్వాత.. న్యూస్‌రూమ్‌లో హై ప్రొఫైల్‌ నిష్క్రమణలు ఊపందుకున్నాయి. అప్పటి నుంచి ఉద్యోగ రాజీనామాలు, తొలగింపుల రౌండ్లు అడపాదడపా కొనసాగాయి. ఏప్రిల్‌ 2025లో అప్పటి ఎన్డీటీవీ నిర్వాహకులు ప్రణరురారు శకానికి స్వస్తి పలకటంతో పాటు ఆయనతో సంబంధం ఉన్న సిబ్బంది అసమానంగా ప్రభావితమయ్యారని ఉద్యోగులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -