Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి వసతి కల్పన గురించి, కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అక్కడి వైద్యులకు రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన సముదాయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు వారిని ఆదేశించారు.  ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి కు వచ్చే రోగుల యొక్క  ఔట్ పేషంట్  వివరాలు, రోజువారీగా నివేదికలు రిజిస్టర్ లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు.

 ఆస్పత్రికి కావలసినటువంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన  ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య  ఆరోగ్యశాఖ అధికారి, దోమకొండ డాక్టర్ ప్రభు దయా కిరణ్, మండల వైద్యాధికారి డాక్టర్ జోహార్ ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad