- Advertisement -
నవతెలంగాణ – మోపాల్: మోపాల్ మండలంలోని తనకుర్ది గ్రామంలో సోమవారం రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలోని చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు, టీవీలు కాలిపోయాయి. నవతెలంగాణ లైన్మెన్ ను సంప్రదించగా.. అప్పుడప్పుడు సర్వసాధారణమని ఆయన తెలపడం గమనార్హం. ఇలాంటి అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఇళ్లల్లోని వస్తూవులు కాదు.. ఈ సారి మనుషులకు కూడా ప్రమాదం సంభవించదని గ్యారంటీ ఏంటీ అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
- Advertisement -