Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వయోజనులకు నవభారత సాక్షరత కార్యక్రమం

వయోజనులకు నవభారత సాక్షరత కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్, డోంగ్లి ,మండలాల్లో వయోజనులకు నవ భారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించడం జరిగిందని  ఐకేపీ ఏపీఎం జగదీష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలియజేశారు. ఉల్లాస్ పథకంలో భాగంగా గతంలో వయోజనులకు పుస్తకాలను పంపిణీ చేసి రాత్రిపూట చదువు చెప్పడం జరిగేదని అన్నారు. వయోజనులకు నిరక్షరాశులకు శనివారం 29-3-2026  వివిధ గ్రామాల్లో పరీక్షల నిర్వహించడం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలు 150 మార్కులకు గాను చదవడం 50 మార్కులు రాయడం యాభై మార్కులు గణితం 50 మార్కులు ఒక్కో విభాగంలో 20 మార్కులు వస్తే వారు పరీక్షలు ఉత్తీర్ణులు అయినట్లు పరిగణిస్తామని తెలియజేశారు. 

మద్నూరు, డోంగ్లి, మండలంలో కలిసి 2056 చదువు రాని అభ్యాసకుల ను గుర్తించడం జరిగిందన్నారు. వారిలో నుండి డోంగ్లి మండలం లో 200 అభ్యాసకులు, మద్నూర్ మండలంలో 600 అభ్యాసకులు పరీక్షలు నిర్వహించడం జరిగింది.మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పరీక్షా శిబిరానికి మద్నూర్ గ్రామపంచాయతీ  సర్పంచ్ శ్రీమతి ఉషా సంతోష్ మేస్త్రి  వచ్చి పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అభ్యాసకులు మరియు వివోఏలు సీసీలు ఏపీఎం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -