సరుకు రవాణా లాజిస్టిక్స్‌పై అధ్యయనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దక్షిణమధ్య రైల్వేల్లో సరుకు రవాణా లాజిస్టిక్స్ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే, ఐఐఎమ్, బెంగళూరు మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ‘రైల్ పార్శిల్ లాజిస్టిక్స్’ పై సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్యఅతిథిగా హాజరై రైళ్ల ద్వారా పార్శిళ్లను రవాణా చేయడానికి ఇంటింటికీ సజావుగా పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవలను అందించే ‘రైల్ పార్శిల్ యాప్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ విప్లవాత్మక రైల్ పార్శిల్ యాప్‌ను అమలు చేసిన మొదటిజోన్‌గా దక్షిణ మధ్యరైల్వే కావడం చాలా గర్వకారణమన్నారు. పార్శిల్ వ్యాపారం భారతీయ రైల్వేలో ఇప్పటివరకు కొనసాగుతుందన్నారు. ఇప్పుడు డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోందన్నారు.
రైల్ పార్శిల్ యాప్ కార్యాలయాన్ని వినియోగదారుల వద్దకు తీసుకు వస్తుందన్నారు. ఆయా ఫారాలను పూరించడం లేదా పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరముందన్నారు. ఈ ఆధునిక యుగంలో, పార్శిల్ బుకింగ్ టాక్సీని బుక్ చేసుకున్నంత సులభం కావాలనీ, రైలు పార్శిల్ యాప్ సాధ్యం చేస్తుందని చెప్పారు. ఇది వేగవంతమైన, నమ్మదగిన పార్శిల్ సేవలను అందించే ప్రక్రియను అందజేస్తుందన్నారు. పారదర్శకత మెరుగైన వినియోగదారుని సౌలభ్యాన్ని అందిస్తుందని వివరించారు. మొదటి సారిగా ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు చెన్నయ్ లో ప్రారంభిస్తున్నామని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐ.ఐ.ఎమ్)తో జోన్ వ్యాప్తంగా ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్‌పై అధ్యయనం చేపట్టడానికి ఒక అవగాహన ఒప్పందం (ఎమ్.ఓ.యూ)పై సంతకం చేసింది.
అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ ఇతర సీనియర్ రైల్వే అధికారులతోపాటు ఎస్సీఎంస్సీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ రాజీవ్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కింద, ఐఐఎమ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ ద్వారా, నిర్మాణాత్మక డిమాండ్ అంచనా, లోతైన విశ్లేషణ, విస్త్రృతమే సంప్రదింపులు, క్షేత్రస్థాయి సర్వే, మౌలిక సదుపాయాల అంతర అంచనాలకు నాయకత్వం వహిస్తుంది. ఇందులో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారు శ్రీమతి హేమ సునీత కూడా ప్రసంగించారు.
నూతన రైల్ పార్శిల్ యాప్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -



