నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను నాయకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకుగ్రామ పంచాయతీ పెద్ద టాక్లి నందు మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజానంద్ దేశాయ్, శివాజి పటేల్, శశాంక్ పటేల్, నాగేష్ పటేల్, మాజీ ఎంపీటీసీ దిన్దయాళ్ పటేల్, శివా రెడ్డీ,శివలింగ్ పటేల్, గ్రామ అధ్యక్షులు సాయిలు గోoడా, విలాస్ గైక్వాడ్, ఆశిప్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES