Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచులు నిస్వార్ధంగా పనిచేయాలి

నూతన సర్పంచులు నిస్వార్ధంగా పనిచేయాలి

- Advertisement -

– ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి
– జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ 

గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి అంకితభావంతో పని చేయాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట నూతన సర్పంచ్ గా గెలుపొందిన ఎండి.రషీద్, డిప్యూటీ సర్పంచ్ రేపని శ్రీనివాసులును జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ గుప్తా, జంగారెడ్డి, శ్రీనివాసులు, శేఖర్ రెడ్డి, నాగోజి, అజార్, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -