నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు మెదక్ జిల్లా నవతెలంగాణ విలేకరులు తమ వంతు విరాళంగా సుమారు రూ.14,000 అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నవతెలంగాణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశంకు విలేకరులు అందించిన ఆర్థిక సహాయాన్ని రీజినల్ మేనేజర్ రేవంత్ కుమార్, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ప్రతినిధి దండు ప్రభు, డెస్క్ ఇన్‌చార్జి దస్తగిరి అందజేశారు. ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ.. సీఐటీయూ కార్మికులు, ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు. నవతెలంగాణ విలేకరులు ప్రజాపోరాటాలకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహాసభల జయప్రదానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏడీవీటీ ఇన్‌చార్జి మల్లేశం, నర్సాపూర్ ఏడీవీటీ ఇన్‌చార్జి మహిపాల్, రికవరీ ఇన్‌చార్జి నారాయణ, విలేకరులు జె. శ్రీనివాస్, బి.మల్లేశం, సాయికృష్ణ, సత్యనారాయణ, చిన్న సాయిలు, ఆర్.శ్రీనివాస్, చెంద్రయ్య, డి.మురళీ, సలీం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ మహాసభలకు..’నవతెలంగాణ’ మెదక్ జిల్లా విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



