- Advertisement -
నవతెలంగాణ – ములుగు
మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి పనుల కారణంగా బుధవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారి తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నేషనల్ హైవేస్ ఏఈ చైతన్య తెలిపారు. ములుగు నుండి హనుమకొండకు వెళ్లే భారీ వాహనాలు అబ్బాపూర్, చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా, హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు పరకాల, చిన్న వాహనాలు శ్రీనగర్ భూపాల్ నగర్ మీదుగా ములుగు వెళ్లాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



