- Advertisement -
న్యూఢిల్లీ : జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో అగ్రశ్రేణి బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న పోటీల్లో మహిళల 48-51 కేజీల విభాగంలో మణిపూర్ బాక్సర్ చానుపై 5-0తో నిఖత్ జరీన్ సులువుగా విజయం సాధించింది. మహిళల 45-48 కేజీల విభాగంలో మీనాక్షి 5-0తో పంజాబ్ బాక్సర్ కశీష్ మెహతాను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది.
- Advertisement -



