ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత వంశీ నందిపాటి మీడియాతో ముచ్చటించారు.
ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. స్టోరీ లెవల్ నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ప్రజెంటర్‌గా ఉన్నాను. ఈ సినిమా పాయింట్‌లో ఫన్ ఉంటుంది. సినిమాలో బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది. ఫన్ ప్లస్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడంతో పాటు హదయానికి హత్తుకునే సినిమా ఇది.
ట్రైలర్, టీజర్‌లో బిజినెస్ అంటూ ఆసక్తికరమైన టాపిక్ పెట్టడానికి కారణం సినిమాపై ఆసక్తి, బజ్ పెంచడానికి. అయితే ఆ బిజినెస్ ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.
తాజాగా సెన్సార్ వారి అభ్యంతరం వల్ల టైటిల్ మారే అవకాశం ఉంది. వారితో చర్చలు జరగుతున్నాయి. ఒకవేళ ‘హే భావన్’గా మారే అవకాశం ఉంది. గత కొంతకాలం నుంచి సుహాస్ ఎదురుచూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు.
పొలిమేర-3 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు లీడ్ రోల్‌లో ఎవరైన స్టార్ యాడ్ అయితే బాగుంటుంది అనుకున్నాం. త్వరలోనే తెలియజేస్తాం. ఈటీవీవిన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను. శివాజీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ని చిత్రాన్ని మార్చి 6న విడుదల చేస్తున్నాం. అలాగే సత్య, శ్రీవిష్ణులతో కూడా సినిమాలు ఉన్నాయి.
ఎవరూ ఊహించలేకపోతున్నారు
- Advertisement -
- Advertisement -



