Thursday, March 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎవరూ ఊహించలేరు

ఎవరూ ఊహించలేరు

- Advertisement -

జగపతి బాబు, లయ జంటగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వదలా’తో రాబోతున్నారు. హృతిక శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్‌ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్‌ చరిత చిత్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ గ్లింప్స్‌ని లాంచ్‌ చేశారు. హీరో జగపతిబాబు మాట్లాడుతూ,’భరద్వాజ మీద అభిమానంతో ఒక సినిమా చేద్దామని కిషోర్‌ ఫీల్‌ అవ్వడంతో ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చోటా కె నాయుడు. తన ఎనర్జీ అందరికీ పంచాడు. కార్తిక్‌ సూపర్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. తన నుంచే ‘వదలా’ అనే టైటిల్‌ కూడా వచ్చింది. లయ అద్భుతమైన పర్ఫామెన్స్‌ ఇచ్చింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. ఆడియన్స్‌ అందరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సునీల్‌ నారంగ్‌ ఉండటంతో మంచి రిలీజ్‌ ఉంటుంది.

కచ్చితంగా మంచి హిట్‌ కొట్టగలమనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘డైరెక్టర్‌ వంశీ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. జగపతిబాబుతో ‘మనోహరం’ సినిమా చేశాను ఆ సినిమా ఒక మెమొరబుల్‌ ఎక్స్పీరియన్స్‌. తర్వాత నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు’ అని హీరోయిన్‌ లయ చెప్పారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘సినిమా తీసి దాదాపుగా పది సంవత్సరాలు అవుతోంది. సినిమా అంటే భయపడుతున్న సమయంలో కిషోర్‌ వచ్చి సినిమా చేద్దామన్నారు. జగపతి బాబుకి కథ చాలా నచ్చింది. కథ పై నమ్మకంతో మొదలుపెట్టాం’ అని అన్నారు. ‘నేను నిర్మాతగా మీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం తమ్మారెడ్డి భరద్వాజ. ఈ సినిమా తీసిన తర్వాత సినిమా అంటే గౌరవం పెరిగింది’ అని నిర్మాత కిషోర్‌ నాయుడు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -