– పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరిక
– ఫామ్‌హౌజ్‌లో ఆయనతో కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేల భేటీ
– స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ
నవతెలంగాణ-మర్కుక్
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత గురించి బీఆర్‌ఎస్ నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆపార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. ఆమె చేసే విమర్శల్ని పట్టించుకోనట్టే ఉండాలని చెప్పారు. శనివారం మెదక్ జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలోలోని ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను ఆపార్టీ నేతలు కే తారకరామారావు, హరీశ్‌రావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. పార్టీ నేతలు త్వరలో జరగనున్న జుబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కేసీఆర్ వారికి సూచించినట్టు సమాచారం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయం సాధిస్తామనే అంశాలపైనే ప్రధానంగా చర్చించారని తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, చింతాప్రభాకర్, కె.సంజరు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్, రవీందర్‌రావు, శంభీపూర్ రాజు, ఎస్సీ, ఎస్టీ, కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోల్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
కవిత విషయం ఎవరూ మాట్లాడొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES