- Advertisement -
- వాటితో కోర్టు నిర్ణయాల్లో మార్పు ఉండదు : బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ స్పష్టీకరణ
- బోల్సోనారోపై తీర్పు దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామం
బ్రెజిల్ : తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై ఆ దేశ సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ చివరి దశ మంగళవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ సుప్రీంకోర్టు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్ళకు లొంగకుంటా వ్యవహరిస్తున్నది. ఈ కేసును ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డి మోరేస్ అభివర్ణించారు. ఈమేరకు కోర్టు సెషన్‌ను ప్రారంభించిన ఆయన.. ఒక నేర సంస్థ హైకోర్టును ఒక విదేశీ ప్రభుత్వం నియంత్రించేలా బలవంతం చేసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. బోల్సొనారో కేసును విచారిస్తున్న ఈ న్యాయమూర్తిపై డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఆంక్షలు విధించిన విషయం విదితమే. విదేశీ ప్రభుత్వాలు నియంత్రించేలా వారు చేస్తోన్న ప్రయత్నాలు కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేయవనీ, ఎందుకంటే జాతీయ సార్వభౌమాధికారం ఎందులోనూ రాజీపడదని స్పష్టం చేశారు. కాగా కేసు విచారణలో భాగంగా దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు బోల్సోనారోకు మద్దతుగా డోనాల్డ్ ట్రంప్ నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కేసును ఆసరాగా చేసుకొని బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలను విధించారు. అంతేకాదు.. బోల్సోనారో కేసును విచారిస్తున్న న్యాయమూర్తులకు కూడా అమెరికా వీసాలను నిరాకరించటం గమనార్హం. కాగా బోల్సోనారోపై తుది దశ విచారణ ఈనెల 12 నాటికి ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Advertisement -