Tuesday, March 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధానికి నిధుల కొరత లేదు : అమెరికా

యుద్ధానికి నిధుల కొరత లేదు : అమెరికా

- Advertisement -

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధం కొనసాగుతోందంటే అది అమెరికా సైనిక శక్తిని చాటిచెప్పడంగా భావించకూడదు. ఈ యుద్ధం అమెరికా ప్రభుత్వ ఆర్థిక సహనానికి లిట్మస్‌ పరీక్షగా నిలుస్తోంది. యుద్ధానికి అవసరమైన నిధులు దేశం వద్ద పుష్కలంగా ఉన్నాయంటూ రక్షణ మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ అమెరికన్లకు భరోసా ఇచ్చారు. మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వం అదనపు నిధుల కోసం ప్రతినిధి సభను అభ్యర్థిస్తోంది. యుద్ధం కారణంగా ప్రజలపై అధిక పన్నుల భారం పడబోదని మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో బెస్సెంట్‌ తెలిపారు. అదనపు నిధులను కోరడమంటే అవి అత్యవసరం అని కాదని వివరణ ఇచ్చారు. రాబోయే నెలలలో సైనిక దళాలు యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేలా చూసేందుకే మరిన్ని నిధులను కోరామని చెప్పారు.

ఘర్షణలు కొనసాగుతున్నందున యుద్ధ సామగ్రి, వనరుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. యుద్ధానికి అవసరమైన అదనపు నిధులను ఎలా సమకూర్చు కుంటారని అడిగిన ప్రశ్నకు బెస్సెంట్‌ సమాధానం ఇవ్వలేదు. అదనపు నిధుల కోసం ట్రంప్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కాంగ్రెస్‌లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అదనపు వ్యయానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. యుద్ధానికి అంత భారీ మొత్తం అవసరమా అని కొందరు సభ్యులు ప్రశ్నించారు. ఈ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని మరికొందరు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -