– కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని జూపల్లి శశికళ, సీనియర్ నాయకుడు జూపల్లి రమేష్ లు నామినేషన్
– గుర్రాల చెరువు నుండి నామినేషన్ కేంద్రం(ఎంపీడీవో కార్యాలయం) వరకు భారీ ర్యాలీ
– పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సీపీఐ (ఎం) నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది. చివరి రోజు మున్సిపల్ కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని జూపల్లి శశికళ 6 వ వార్డు ఆర్వో లు ఆర్.మారెమ్మ,సీహెచ్.శివాజీ లకు, సీనియర్ నాయకుడు జూపల్లి రమేష్ 13 వ వార్డు ఆర్వో లు టి.ఉపేంద్ర రెడ్డి,ఐనంపుడి జపాన్ రావు లు కు అందజేసారు.
శశికళ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, రమేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య లు పాల్గొన్నారు.
జూపల్లి రమేష్ – శశికళ దంపుతుల నామినేషన్ ర్యాలీ 13 వార్డు గుర్రాల చెరువు గ్రామంలో ప్రారంభం అయి నామినేషన్ స్వీకరణ కేంద్రం (ఎంపీడీవో కార్యాలయం) వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు న ద్విచక్ర,కార్లు,నడక మార్గంలో సాగింది.ఈ నామినేషన్ ర్యాలీ ముందు భాగంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సీపీఐ (ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కి మండలంలోని పలు గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





