– 22 వార్డు లకు 146 నామినేషన్ లు
– నామినేషన్ దాఖలు చేసిన వారిలో ప్రముఖులు
– పరిశీలిస్తున్న అభ్యంతరాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రెండో సాధారణ మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మూడో రోజు శుక్రవారంతో ముగిసింది. శనివారం నామినేషన్ లను పరిశీలిస్తున్నారు. అశ్వారావుపేట లో 22 వార్డులకు 146 నామినేషన్ లు అందినట్లు ఎన్నికల జిల్లా సహాయ అధికారి,అశ్వారావుపేట కమీషనర్ బి.నాగరాజు తెలిపారు. మొదటి రోజు ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి మూడు నామినేషన్ లు అందాయని,రెండో రోజు గురువారం మొత్తం 56 మంది నుండి 58 నామినేషన్ లు దాఖలు అయ్యాయని తెలిపారు. మూడో రోజు శుక్రవారం 77 మంది 85 నామినేషన్ దాఖలు అయ్యాయి అని తెలిపారు.
ఇందులో మొత్తం బీఆర్ఎస్ నుండి 50, ఐ.ఎన్.సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) నుండి 48, రిజిస్టర్ పొలిటికల్ పార్టీలు నుంచి 18,బీజేపీ నుంచి 16, స్వతంత్రులు నుండి 11, సీపీఐ (ఎం) నుంచి 03 చొప్పున మొత్తం 146 నామినేషన్ లు దాఖలు చేశారు అన్నారు.నామినేషన్ లు వేసిన వారిలో పులువురు ప్రముఖులు ఉన్నారు. ఏడీ ఆర్పీ(అలయన్స్ డెమోక్రటిక్ రిసోర్స్ పార్టీ) నుండి 7,ఇండిపెండెట్స్(స్వతంత్రులు) నుండి 6,బీజేపీ నుండి 6,సీపీఐ(ఎం) నుండి 2,ఆర్ఎల్డీ (రాష్ట్రీయ లోక్ దళ్ ) నుండి 1 చొప్పున మొత్తం 58 నామినేషన్ లు అందినట్లు ఆయన తెలిపారు.
3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మేజర్ పంచాయతీ చివరి పాలకవర్గం సభ్యులు ఉపాధ్యాయుల సూర్యప్రకాశ్ రావు. 4 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గా సీపీఐ ఎం జిల్లా నాయకులు చిరంజీవి కూతురు, మున్సిపల్ ఉద్యోగి కట్టా శ్రీనివాస్ సతీమణి సింధు, కాంగ్రెస్ నాయకురాలు, అశ్వారావుపేట మండల పరిషత్ గత పాలకవర్గం సభ్యురాలు వేముల భారతి ప్రతాప్, 6 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, ఛైర్పర్సన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జూపల్లి రమేష్ సతీమణి శశికళ, బీఆర్ఎస్ నుండి అశ్వారావుపేట జిల్లా పరిషత్ పూర్వ సభ్యులు జూపల్లి పద్మజ, 7 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి అశ్వారావుపేట మండల పరిషత్ పూర్వ పాలకవర్గం సభ్యులు,మేజర్ పంచాయతీ అశ్వారావుపేట సర్పంచ్ కు పోటీ దారుడు, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన చానెల్ నియోజకవర్గం ప్రతినిధి కొల్లి రవికిరణ్, కాంగ్రెస్ నుండి పశుసంవర్ధక శాఖ విశ్రాంత ఉద్యోగి, మేజర్ పంచాయతీ అశ్వారావుపేట సర్పంచ్ పోటీదారుడు బూసి పాండు రంగ,
8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా,బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని గా నుంచి బీఆర్ఎస్ నుంచి మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం పూర్వ అధ్యక్షులు కాసాని వెంకటేశ్వరరావు తనయుడు కాసాని చంద్ర మోహన్ సతీమణి నాగశేషపద్మ, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఎన్పీడీసీఎల్ ఉద్యోగి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన చానెల్ నియోజకవర్గం ప్రతినిధి వలీపాషా సతీమణి రెహానా షేక్,10 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి అశ్వారావుపేట మండల పరిషత్ పూర్వ పాలకవర్గం సభ్యులు మిండ హరిబాబు, బీఆర్ఎస్ అశ్వారావుపేట జిల్లా పరిషత్ పూర్వ సభ్యులు జూపల్లి పద్మజ,
11 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి ఎన్నికల ముందు సీపీఐ ( ఎం) నుంచి బీఆర్ఎస్ లోకి దూకిన పేరాయిగూడెం పూర్వ ఉపసర్పంచ్ తగరం జగన్నాధం, కాంగ్రెస్ పాత వర్గం నాయకులు జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, 12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి ప్రముఖ వైద్యులు,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు సతీమణి డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి, కాంగ్రెస్ నుంచి మేజర్ పంచాయతీ అశ్వారావుపేట చివరి సర్పంచ్ అట్టం రమ్య, 13 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అనుచరుడు జూపల్లి రమేష్ బాబు,బీఆర్ఎస్ నుండి అశ్వారావుపేట జిల్లా పరిషత్ పూర్వ సభ్యులు జూపల్లి పద్మజ,
14 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి ప్రముఖ వైద్యులు,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు సతీమణి డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి, 16 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ సతీమణి సత్యవరపు ప్రసన్న లక్ష్మి, 17 వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,మండల పరిషత్ పూర్వ సభ్యురాలు మొగళ్ళపు ఉదయ నాగలక్ష్మి, 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి లైసెన్స్ కాంట్రాక్టర్ శెట్టిపల్లి రఘురాం, కాంగ్రెస్ నుంచి ప్రముఖ తాపీ మేస్త్రీ,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు తిరుమలశెట్టి వెంకన్న బాబు, సీపీఐ నుంచి ప్రముఖ యువ లాయర్ తిర్నాటి సంజయ్, కాంగ్రెస్ పాత వర్గం నాయకులు జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి,
21 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ (ఎం) అభ్యర్థిని,మహిళా సంఘం డివిజన్ నాయకురాలు, జెడ్పీటీసీ పోటీదారు తగరం నిర్మల, బీజేపీ నుంచి మద్దాల దేవి, 22 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి యువకుడు దివాకర్, బీఆర్ఎస్ నుండి సింగరేణి కాలరీస్ విశ్రాంత ఉద్యోగి జుజ్జూరపు శ్రీరామ మూర్తి లు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ప్రముఖులు.


