- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్‌లో చాటింగ్ చేస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూర్ మహమ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నూర్ మహమ్మద్‌ను పోలీసులు కదిరి కోర్టులో హజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 29వ తేదీ వరకు నిందితుడు రిమాండ్‌లో ఉండనున్నాడు. కోర్టు తీర్పు మేరకు నూర్ మహమ్మద్‌ను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.
- Advertisement -