- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు సాధారణం లేదా తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన ముందస్తు వాతావరణ సూచికలో పేర్కొంది. మరోవైపు జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 568.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 22 శాతం అధికంగా 694.1 మి.మీటర్లు కురిసినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. ఐదు జిల్లాల్లో 60 శాతానికిపైగా వర్షపాతం నమోదైంది. నిర్మల్(28శాతం), పెద్దపల్లి(17), నల్గొండ(11), మంచిర్యాల(5), జయశంకర్ భూపాలపల్లి(7శాతం) జిల్లాల్లో లోటు నమోదైంది.
ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Advertisement -