హమాస్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, జెరూసలేం : గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని హమాస్ భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు చావాలనుకుం టున్నారని తనకనిపిస్తోందని దురుసుగా వ్యాఖ్యలు చేశారు. ఖతార్‌లో హమాస్‌తో జరుగుతున్న పరోక్ష చర్చల నుంచి అమెరికా, ఇజ్రాయిల్ ప్రతినిధులు గురువారం బయటకు వచ్చేసిన అనంతరం ట్రంప్ స్పందించారు. ”ఇది చాలా తీవ్రమైన అంశం. ఒప్పందం కావాలని హమాస్ నిజంగా కోరుకోవడం లేదు. ఒప్పందం కుదుర్చుకునే కన్నా చావడం మంచిదని వారు భావిస్తున్నారనుకుంటానని వ్యాఖ్యానించారు. మిగిలిన బందీలను కూడా అప్పగించడానికి వారు సిద్ధంగా లేరు. ఎందుకంటే చివరి బందీని అప్పగించిన మరుక్షణం ఏమవుతుందో వారికి తెలుసు’ అని అన్నారు. చర్చల్లో హమాస్ విశ్వసనీయంగా వ్యవహరిం చలేదని ట్రంప్ ప్రత్యేక దూత విట్కాఫ్ విమర్శించారు. గురువారం ఈ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. హమాస్ సీనియర్ అధికారి బసీమ్ నయీమ్ మాట్లాడుతూ, చర్చల వాస్తవికతను వక్రీకరిం చడానికి విట్కాఫ్ ప్రయత్నించారని విమర్శించారు. ఇప్పటికే ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల నుంచి వెనక్కి మళ్లుతున్నారని అన్నారు. చర్చలు తిరిగి పునరుద్ధరించడానికి ఇంకా అవకాశాలు వున్నాయని మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ చెప్పాయి.
కాల్పుల విరమణ కోరుకోవటం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES