మా కుటుంబ సమస్య..
– మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమార, కుమారుడు ప్రద్యుమ్న..
నవతెలంగాణ – బంజారా హిల్స్
మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి టికెట్ కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకోవాలె, టికెట్ ఎప్పుడు పోరాడి తెచ్చుకొనే వాడు. 43 ఏండ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడు కలగజేసుకోలేదని, రాజకీయాలతో సంబంధం లేనే లేదని ఆమె తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మనవడు మాగంటి తారక్ ప్రద్యుమ్న, కోడలు మాలినీ దేవీలతో మాట్లాడారు. గోపినాథ్ మరణమే ఒక్క మిస్టరీ అన్నారు. అందుకే విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తల్లిగా తను కోరుతున్నానని అన్నారు. గోపినాథ్ ఉన్నన్ని రోజులు కొడుకుని మంచిగా చూసుకున్నడానీ, అందుకే వారు బయటికి రాలేదు. చనిపోయాన తరవాతనే బయటకు రావటానికి కారణం రాజకీయ స్వార్థం కోసం కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలకు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. లీగల్ సర్టిఫికెట్ విషయం నుంచే తమ మధ్య వివాదం జరుగుతుందని, గత రెండు ఎలక్షన్స్ లో అయినా అన్న వజ్రనాథ వెనకాల ఉండి గెలిపించాడానీ అన్నారు.
కానీ శవరాజీకియాలు అంటూ.. అతన్ని పక్కకు పెట్టడం ఎంతవరకు సమంజసం కాదని, ఎలా చనిపోయాడు అనే అనుమానంతోనే పోలీసులకుకు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. మాగంటి గోపినాథ్ కొడుకు ప్రద్యుమ్న మాట్లాడుతూ..లీగల్ గా నేను కొడుకుని అని కొట్లాడుతున్నడానీ, నా బర్త్ సర్టిఫికెట్స్ లో, నా స్టడీ సర్టిఫికెట్స్ లో నా తండ్రి పేరు ఉందని అన్నారు. నాతో సునీత మాట్లాడుతూ.. యూఎస్ఏలో ఉన్న నీవు ఇండియాకు రావద్దు. అమెరికాలోనే ఉండు.. కేటీఆర్ అంకుల్ కి చెప్పి ఆయన సంస్థల్లోనే ఉద్యోగం పొందే విధంగా చూస్తున్నారని, మా నాన్న నాతో రెగ్యులరగా మాట్లాడే వారనీ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నన్ను ఇక్కడకి రాకుండా అడ్డుకున్నరాని ఆవేదన వ్యక్తపరిచారు. పొలిటికల్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. జూన్ 25 న డెత్ సర్టిఫికెట్ దరఖాస్తు చేస్తే, జూలై 4జారీ చేశారని, ఒక్క వారం ముందు మొదలైన సమస్య కాదు.. జులై నుంచి నడుస్తుందని, నా పేరుని లీగల్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని సునితను వారు ప్రశ్నించారు.



