Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు నోటీసులు

ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు నోటీసులు

- Advertisement -

– తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ నోటీసులు జారీ చేసింది. హెల్త్‌కేర్‌ రిఫార్స్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్డీఏ) రాష్ట్ర విభాగం, కరీంనగర్‌ జిల్లా విభాగాలు ఫిర్యాదు ఆధారంగా బుధవారం ఈ నోటీసులు జారీ చేసినట్టు కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దండెం లాలయ్య కుమార్‌ తెలిపారు. నకిలీలు (ఆర్‌ఎంపీ), అర్హత లేనివారు, రిజిస్టర్‌ చేసుకోకుండా ఆధునిక వైద్యం చేస్తున్న వారికి మద్ధతుగా సదరు ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాటలు పలు వైద్య చట్టాలను ఉల్లంఘించేలాగా ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిపై అబద్ధపు ఆరోపణలు చేసినట్టు పేర్కొన్నారు. వీటిపై వారం రోజుల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలనీ, లేనిపక్షంలో కౌన్సిల్‌ చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -