Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ..! 

 ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ..! 

- Advertisement -

నవతెలంగాణ ఎఫెక్ట్….
నవతెలంగాణ – రాయికల్
: సమయపాలన పాటించని వైద్య సిబ్బంది రాయికల్ లో ప్రజల ఇబ్బందులు… శీర్షికన గురువారం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె.ప్రమోద్ స్పందించారు. గురువారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై వైద్యులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు, సమయపాలనలో నిర్లక్ష్యం వహిస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ తెలిపారు. గతంతో పోల్చుకుంటే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గిన విషయంపై నవతెలంగాణ వివరణ కోరగా…సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే నెలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రిలో సానిటేషన్, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వల్ల గర్భిణీలు డెలివరీ సమయంలో అడ్మిట్ కావడంలేదని వైద్యులు సూచించినట్లు జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad