నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యాంటి బయాటిక్స్ ఔషధాల అమ్మకంలో నిబంధనలు ఉల్లంఘించిన 193 మెడికల్ షాపులకు డ్రగ్ కంట్రోల్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)ను నియంత్రిం చేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, అమ్మిన బిల్లును ఇవ్వకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకపోవడం, షెడ్యూల్ హెచ్ 1 డ్రగ్ రిజిస్టర్‌ను నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్స్ లేకపోవడం వంటి లోపాలను డ్రగ్ ఇన్ స్పెక్టర్లు గుర్తించారు. ఈ మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్, 1940 నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
193 మెడికల్ షాపులకు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES