Wednesday, May 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభయారణ్యంలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

అభయారణ్యంలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్‌ అభయారణ్యాన్ని ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సందర్శించారు. 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ట్రైనీ అధికారులు తెలంగాణ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధి జన్నారం అటవీ డివిజన్‌లోని గొండుగూడ, బైసన్‌కుంట తదితర ప్రాంతాలను సందర్శించారు. రెండ్రోజులపాటు అభయారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో వారు పర్యటించనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌ఆర్‌ఓ సుష్మారావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -