లాభమొచ్చే పంటల్ని రైతులు పండించాలి
అన్ని పంటలకూ రాష్ట్ర వాతావరణం అనుకూలం
22 నుంచి 26 వరకు నర్సరీ మేళా
నర్సరీలను పట్టణ వాసులు, రైతులు ఉపయోగించుకోవాలి : 19వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జిల్లా కేంద్రాల్లోనూ నర్సరీ మేళాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పండే ప్రతి పంటనూ పండించేందుకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందనీ, ఈ నేపథ్యంలో లాభమొచ్చే పంటల్ని రైతులు పండించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్ నర్సరీ మేళాలను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చి హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర పట్టణ వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అధిక లాభం వచ్చే పండ్ల, పూల తోటలతో పాటు ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు.
ఇలాంటి నర్సరీలు రైతాంగానికి, పట్టణ వాసులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. పండ్లు, పూల, కూరగాయల మొక్కల నర్సరీలను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ కృషి చేస్తోందన్నారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ.. ఈ నర్సరీమేళాలో భారతదేశంలోని అన్ని పూలమొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రైతులకు, పట్టణ ప్రాంతాల్లో గార్డెనింగ్‌కు అవసరమైన పాట్స్, పాటింగ్, ఇలా అన్ని రకాల మెటీరియల్స్ కూడా మేళాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. బోన్సారు గార్డెన్‌కు సంబంధించి అర్నమెంటల్ మెటీరియల్, డెకరేషన్ మెటీరియల్ ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల వాళ్లు ఈ మేళాలో తమ నర్సరీలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రదన్శనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళా ఇన్‌చార్జి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ..ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు.
జిల్లా కేంద్రాల్లోనూ నర్సరీ మేళాలను ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



