నవతెలంగాణ-దుమ్ముగూడెం
గుండె సంబంధిత వ్యాధితో నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మోతుకూరి వెంకటేశ్వర్లు, సావిత్రి దంపతులకు శృతి (21) ఏకైక సంతానం. వైద్య వృత్తిపై ఆసక్తి ఉన్న శృతి భద్రాచలంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అప్రెంటిస్ విధానంలో నర్సింగ్ చేస్తోంది. గత కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. గుండెకు నీరు పట్టిందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని వైద్యం కోసం తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం నుంచి ఖమ్మం తరలించారు. అక్కడ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది.
గుండె సంబంధిత వ్యాధితో నర్సింగ్ విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



