Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నర్సింగ్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి

నర్సింగ్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి

- Advertisement -

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని
నవతెలంగాణ – వనపర్తి 
: నర్సింగ్ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి అన్నారు. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవాారం చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడుతూ గృహహింస నిరోధక చట్టం, పోక్సో యాక్ట్, పోష్ యాక్ట్ ల గురించి వివరిస్తూ మైనర్లు ఇచ్చిన అంగీకారాలు చట్టపరంగా చెల్లవు కాబట్టి మైనర్లు చేసుకున్న వివాహాలు చెల్లెవు అని తెలియజేశారు.

మైనర్ల అంగీకారంతోనే లైంగిక సంబంధం కలిగి ఉన్న అది చట్టపరంగా అత్యాచారం అవుతుందని తెలియజేశారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పరిధిలోకి రాని మహిళలు ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయితే లోకల్ కంప్లైంట్ కమిటీలో ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్ కృష్ణయ్య, కళాశాల ప్రధానోపాధ్యాయులు ఇందిరా ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -