ప్రభుత్వ భూములు గొర్లకాపరుల సొసైటీలకు ఇవ్వాలి..
జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య డిమాండ్
నవతెలంగాణ – ధర్మసాగర్
గొర్రెలు మేకలకు ప్రభుత్వం వెంటనే నట్టల మందులు పంపిణీ చేయాలని,మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వెంటనే గొర్ల మేకల మేత కోసం గొర్ల కాపర్ల సొసైటీలకు ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడ బోయిన లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ధర్మసాగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గొర్ల కాపర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.తాహసిల్దార్ సదానందం స్పందిస్తూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు గొర్ల మేకలకు సంవత్సరానికి మూడుసార్లు నట్టల మందు పంపిణీ చేస్తామని,20 నెలలు అవుతున్న ఒక్కసారి కూడా నటల మందు పంపిణీ చేయలేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.ఓట్ల వేయించుకోవడం పై పెట్టిన దృష్టి గొర్ల కాపరుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదని అన్నారు.
మండలంలో అనేక గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని,ఈ భూములను శిరోషికంలో తుమ్మ చెట్లను గొర్ల మేకల మేత కోసం కేటాయిస్తూ 559,1016 జీవోలను జారీ చేసినప్పటికీ ఈ జీవలు అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు వివిధ ప్రమాదంలో గుర్లు మేకలు చనిపోయి గొర్ల కాపర్లు ఉపాధి కోల్పోతున్నారని, చనిపోయిన గొర్లకు ఏలాంటి నష్టపరిహారం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గొర్లు,మేకలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ గర్జనలో టిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని నేను అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ ద్వారా గొర్ల కాపర్ల అకౌంట్లో వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తెచ్చి కట్టిన డీడీలను వాపసు చేసి,గొర్ల కాపరులకు తీవ్రంగా అన్యాయం చేసిందని అన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో గొర్లకాపర్లందర్నీ సమీకరించి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు తొట్టే భీమన్న, కాసాని పరుశురాములు, తూము కుమారస్వామి,గంటే శ్రీకాంత్, దోకి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
నట్టల మందులు పంపిణీ చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES