నవతెలంగాణ -మంగపేట
మండల కేంద్రంలోని గంపోనిగూడెం బీసీ కాలనీకి చెందిన చెట్టె సాయికుమార్(24) అనారోగ్యంతో ఉరి పెట్టుకోని మరణించగా ఆయన కుటుంబాన్ని మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందజేసినట్లు మండల పార్టీ ఇంచార్జ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీగొండ కాంతారావు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ.హిధాయతుల్లా, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కుర్సం రమేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, సీనియర్ నాయకులు తూడి భగవాన్ రెడ్డి, బసారికారి హరికృష్ణ, ఆకు పవన్, తాలూక సంపత్ లు పాల్గొన్నారు.