Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడిల్లో పోషకారం అందించాలి

అంగన్ వాడిల్లో పోషకారం అందించాలి

- Advertisement -

సర్పంచ్ మేకల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

అంగన్ వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహరం లబ్ధిదారులకు అందించాలని మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య సూచించారు. సోమవారం మల్లారం అంగన్ వాడి కేంద్రాన్ని సర్పంచ్ తనిఖీ చేశారు. టీచర్, ఆయా సమయపాలన పాటిస్తున్నారా.. లేదాని అరా తీశారు. రోజువారీ రిజిస్టర్లు తనిఖీ చేశారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారాలను అందించాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులకు యూనిపామ్స్, కిశోర బాలికలకు బాలామృతం, పల్లిమట్టిలు అందజేశారు. అనంతరం ఆరోగ్య లక్ష్మీ కమిటిపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్ పద్మ,ఆయా, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -