నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పోషక ఆహారోత్సవాన్ని నిర్వహించారు. 3వ శనివారం తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా విద్యార్ధులకు పోషక విలువల ఆహారం ప్రాముఖ్యతను తెలయపర్చేందుకు పోషక ఆహారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యయురాలు పరుచూరి హరిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లలకు ప్రతి రోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, బైట దొరికే జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచాలని, తాజా కూరగాయలతో పాటు, పళ్ళు కూడా అందేలా చూడాలని అన్నారు. మంచి ఆరోగ్యం కలిగిన పిల్లలు చదువులో రాణిస్తారని అన్నారు. విద్యార్ధుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు సీ.ఆర్.పీ ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
పాఠశాలలో పోషక ఆహారోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


