– గమనించిన చిన్నపాటి లోపాలు
– సుచీ శుభ్రం గా ఆహార పదార్థాలు వడ్డించాలి
– మండల ప్రత్యేకాధికారి ప్రదీప్
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లాలోని దమ్మపేట మండలం,గండుగులపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురైన నేపధ్యంలో మండలంలో ని పలు శాఖల వసతి గృహాలను సందర్శించి,వైఫల్యాలను సరిదిద్దాలలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల ప్రకారం మండల ప్రత్యేఖ అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావు సోమవారం ఏజీహెచ్ఎస్ అనంతారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు.పాఠశాలలోని టాయిలెట్లకు చిన్నపాటి మరమ్మతులు చేపట్టాలని సూచించారు.హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుని, విద్యార్థినీలు సంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే డార్మెటరీలు, పాఠశాల మరియు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు దాసరయ్య ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మద్దికొండ, కేశప్పగూడెం, ఊట్లపల్లి పాఠశాలలను కూడా సందర్శించి, ఉపాధ్యాయుల పనితీరు, సమయపాలన, విద్యార్థుల విద్యా స్థాయిలను పరిశీలించారు.



