Monday, October 27, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజావాణికి అధికారుల డుమ్మా

ప్రజావాణికి అధికారుల డుమ్మా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు డుమ్మలు కొడుతున్నారు. సోమవారం మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అధ్యక్షతన జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో రాణి, ఆరోగ్య సిబ్బంది తప్ప, మిగతా శాఖల అధికారుల కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. అధికారులకు ప్రజావాణి అంటే రిస్కుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి వారంవారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. డుమ్మాలు కొట్టే అధికారులను ప్రశ్నించేవారు లేకపోవడం వల్లే వారు ఇలా గైర్హాజరవుతున్నారు. ఇప్పటికైనా విధులకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -